RSS సీనియర్ నేత భయ్యాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని మాజీ CM అనుమానం

by Gantepaka Srikanth |

ఆర్ఎస్ఎస్(RSS) సీనియర్ నేత సురేష్ భయ్యాజీ(Suresh Bhaiyaji) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఉండాలంటే మరాఠీ(Maratha) మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.

RSS సీనియర్ నేత భయ్యాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని మాజీ CM అనుమానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఎస్ఎస్(RSS) సీనియర్ నేత సురేష్ భయ్యాజీ(Suresh Bhaiyaji) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఉండాలంటే మరాఠీ(Maratha) మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఘాట్‌కోపర్‌లో అధికార భాష గుజరాతీ(Gujarat)నే అని హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా.. సురేష్ భయ్యాజీ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ముంబై నగరాన్ని(Mumbai City) లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో RSS, బీజేపీ రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయని అన్నారు.

మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ ప్రతినిధి సభను బెంగళూరులో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21, 22, 23 తేదీల్లో ఈ సభ జరపాలని ఇప్పటికే నిర్ణయించారు. గతేడాది నాగ్‌పూర్‌లో నిర్వహించగా ఈ ఏడాది ఈ వేడుకలకు బెంగళూరు వేదిక కానుంది. ఈ సమావేశంలో 2024-25 సంవత్సరపు కార్యకలాపాల నివేదికను ప్రతిపాదిస్తారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణతో పాటు చేయవలసిన పనుల గురించి కూడా సమావేశంలో చర్చిస్తారు. అనంతరం ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Next Story