- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ యూటర్న్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 75ఏళ్లు వస్తే రిటైర్మెంట్ తీసుకుని కొత్తవారికి, యువకులకు అవకాశాలు ఇవ్వాలని ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 75ఏళ్లు వస్తే రిటైర్మెంట్ తీసుకుని కొత్తవారికి, యువకులకు అవకాశాలు ఇవ్వాలని ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మోడీని ఉద్దేశించే మాట్లాడారని వార్తలు వినిపించాయి. కాగా ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు. సంఘంలో మనమందరం వాలంటీర్స్, మనల్ని ఏం చేయమంటే అది చేయాలి.
వయసు అడ్డుగా పెట్టుకుని ఏదైనా పనిచేసేందుకు నిరాకరించకూడదని అన్నారు. తాను రిటైర్ అవుతానని కానీ వేరే వాళ్లు రిటైర్ అవ్వాలని కానీ తాను ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సంఘంలో మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడతాయని చేయాలని అనిపించినా లేకపోయినా చేయాల్సిందే అని చెప్పారు. 80ఏళ్ల వయసులో వెళ్లి శాఖలో శిక్షణ ఇవ్వాలన్నా అది చేయాల్సిందే అని తెలిపారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ లో ప్రధాని మోడీ, మోహన్ భగవత్ 76 ఏళ్లలో అడుగుపెట్టనున్నారు.






