JP Nadda: గర్భిణీలకు రూ.21 వేలు.. రూ.500కే సిలిండర్.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

by Shamantha N |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో(Delhi election BJP manifesto)ను విడుదల చేసింది.

JP Nadda: గర్భిణీలకు రూ.21 వేలు.. రూ.500కే సిలిండర్.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో(Delhi election BJP manifesto)ను విడుదల చేసింది. ‘సంకల్ప పత్రా’ పార్ట్‌-1 పేరుతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(BJP president JP Nadda) మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం అందిస్తామంది. అంతేకాకుండా, ఆరు పౌష్టికాహార కిట్లు, ప్రస్తుతం తొలి సంతాన సమయంలో రూ.5 వేలు ఇస్తుండగా.. రెండో సంతానానికి రూ.6 వేలు అదనంగా ఇస్తామన్నారు. పేద కుటుంబాలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్‌ ఇస్తామంది. ఏటా దీపావళి, హోళీ సమయంలో ఉచితంగా ఒక్క సిలిండర్ ఇస్తామన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. మురికివాడల్లో అటల్‌ క్యాంటీన్‌ల ఏర్పాటు చేయడమే కాకుండా.. రూ.5కే భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశరాజధానిలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామన్నారు. దీనికి అదనంగా రూ.5 లక్షల హెల్త్ కవరేజీని ఇస్తామని తెలిపారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇవే కాకుండా, సంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపడతామని చెప్పుకొచ్చారు.

Next Story