నిన్న రాజకీయాలకు, ఇంటికి దూరం.. నేడు సోషల్ మీడియాలో తేజస్వీ యాదవ్ పై సంచలన పోస్ట్

by Malleboina Mahesh |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి తర్వాత.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్యా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

నిన్న రాజకీయాలకు, ఇంటికి దూరం.. నేడు సోషల్ మీడియాలో తేజస్వీ యాదవ్ పై సంచలన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి తర్వాత.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్యా (Rohini Acharya), రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆమె తన సోషల్ మీడియాలో తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) పై సంచలన ఆరోపణలతో పోస్ట్ చేశారు. పార్టీలో, ఇంట్లో తనకు తీవ్రమైన అవమానం జరిగిందని, దూషణలు, బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు. “నిన్న ఒక కుమార్తె, అక్క, భార్య, తల్లి అయిన నాకు జరిగిన అవమానం వర్ణనాతీతం. నా ఆత్మగౌరవాన్ని రాజీ పడకపోవడం, నిజం ముందు తలవంచక పోవడమే నన్ను ఇలా అవమానించాలని కారణమైంది,” అని రోహిణి తన పోస్టులో పేర్కొన్నారు.

కుటుంబ వివాదం తీవ్రంగా పెరిగిన సందర్భంలో రోహిణి చేసిన వ్యాఖ్యలు బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేపాయి. అలాగే “వాళ్ళు నన్ను నా సొంత ఇంటి నుంచి చీల్చి వేశారు. నన్ను అనాధగా చేశారు,” అని ఆమె భావోద్వేగంగా తన పోస్టులో రాసుకొచ్చింది. తనలాంటి పరిస్థితిని మరెవరూ అనుభవించకూడదని కోరుతూ, కుటుంబం, రాజకీయాల్లో ఎదురైన అవమానాలే తన నిర్ణయానికి కారణమని రోహిణి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిణామంతో లాలూ కుటుంబంతో పాటు ఆర్జేడీ పార్టీపై తీవ్ర స్థాయి ప్రభావం పడింది. గతంలో లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఆర్జేడీ పార్టీని, తన ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయాడు.

Next Story