అమెరికాలో రోడ్ ఆక్సిడెంట్.. భారతీయుడు అరెస్ట్

by Muthe.Rajitha |

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

అమెరికాలో రోడ్ ఆక్సిడెంట్.. భారతీయుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం అయిన జషన్‌ప్రీత్ సింగ్‌ అనే భారతీయుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఆ ఘటనలో సింగ్‌ కూడా గాయపడగా... ట్రక్‌ నడుపుతోన్న సమయంలో అతడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్యులు నిర్దారించారని హైవే పెట్రోలింగ్ అధికారి తెలియజేసారు. అలాగే ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్‌ వేయలేదని ట్రక్‌ డ్యాష్‌క్యామ్‌ రికార్డింగ్‌ను బట్టి తెలుస్తోందన్నారు.

జషన్‌ప్రీత్ సింగ్‌ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడని అని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. 2022లోనే అమెరికాకు రాగా.. అప్పుడు కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని విడుదల చేశారు. అతడి వద్ద లీగల్ పేపర్స్ ఏవీ లేవని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ధ్రువీకరించింది. ఇదిలాఉంటే.. ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు కారణమైన హర్జిందర్ సింగ్‌ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి విదేశీ ట్రక్ డ్రైవర్లపై అమెరికా మరిన్ని కఠిన నిబంధనలు విధించింది.

Next Story