Elections: జర్మనీలో రైజింగ్ రైట్‌వింగ్? రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారి రికార్డులు

by Mahesh Kanagandla |   (  Updated:2025-02-23 19:47:45  IST  )

జర్మనీలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగియగానే ఏఆర్‌‌డీ, జెడ్‌డీఎఫ్ పబ్లిక్ టెలివిజన్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి.

Elections: జర్మనీలో రైజింగ్ రైట్‌వింగ్? రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారి రికార్డులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్(Right Wing) రైజ్ అవుతున్నది. జర్మనీలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు(Germany Parliament Elections) జరిగాయి. పోలింగ్ ముగియగానే ఏఆర్‌‌డీ, జెడ్‌డీఎఫ్ పబ్లిక్ టెలివిజన్లు ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలు వెలువరించాయి. ఈ అంచనాల ప్రకారం జర్మనీలో రాజకీయంగా గణనీయమైన మార్పులు సంభవించనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత బలమైన స్థితికి ఫార్ రైట్ వింగ్ పార్టీ చేరనుంది. 2021 ఫలితాల కంటే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) రైట్ వింగ్ పార్టీ 19.5 శాతం నుంచి 20 శాతం ఓట్లతో రెండింతలు మెరుగుపడింది. ఇక సెంటర్-రైట్ అపోజిషన్ లీడర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కొత్త చాన్సిలర్‌గా వచ్చే అవకాశాలున్నాయి. ఈయన కన్వజర్వేటివ్ పార్టీ లీడ్‌లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే మెర్జ్ విజయాన్ని కూడా ప్రకటించారు. కాగా, సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్లు ప్రపంచ యుద్ధం తర్వాత దారుణంగా దిగజారిపోయారు. ఈ పార్టీ నేత, జర్మనీ చాన్సిలర్ ఒలాఫ్ షోల్జ్ పార్టీ వరస్ట్ పర్ఫార్మెన్స్‌తో మూడో ప్లేస్‌లో నిలవనుంది. ఈయన పార్టీలో అంతర్గత కుమ్ములాట కారణంగా జనరల్ ఎన్నికలు ఏడు నెలలు ముందుగానే జరుగుతున్నాయి. ఫైనాన్స్ మినిస్టర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత ఒలాఫ్‌ పార్లమెంటులో బలనిరూపణలో వీగిపోయారు. దీంతో జనరల్ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Next Story