RG Kar case: తొందరపాటు చర్యలు వద్దు.. దీదీపై ఆర్జీకర్ మృతురాలి తండ్రి ఆగ్రహం

by Shamantha N |

ఆర్జీ కర్ హత్యాచారం (RG Kar case) కేసులో దోషి సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్‌ సర్కారు మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

RG Kar case: తొందరపాటు చర్యలు వద్దు.. దీదీపై ఆర్జీకర్ మృతురాలి తండ్రి ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జీ కర్ హత్యాచారం (RG Kar case) కేసులో దోషి సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్‌ సర్కారు మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ కేసులో(Kolkata Doctor Rape and Murder Case) సర్కారు తీరును మృతురాలి తండ్రి తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు అవసరం లేదని అన్నారు. ‘‘ త్వరలోనే మాకు తీర్పు కాపీ వస్తుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. అప్పటివరకు సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. ఆమె ఎన్నో మాటలు చెప్పి.. చివరికి సాక్ష్యాలను తారుమారు చేశారు. సాక్ష్యాలు గోల్ మాల్ చేసిన వారిలో పోలీస్‌ కమిషనర్, ఇతరుల ప్రమేయం ఉంది. ఇవన్నీ దీదీ చూడలేదా..?’’ అని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం వల్లే.. స్థానిక కోర్టులో జీవిత ఖైదు పడినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.

సిల్దా కోర్టు తీర్పు ఏంటంటే?

గతేడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జీ కర్‌ ప్రభుత్వాస్పత్రి సెమినార్‌ రూమ్‌లో నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో సిల్దా కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. కోర్టు సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకూ జైలు జీవితం గడపాలంది. దోషికి రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపైనే బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు వెళ్లింది.

Next Story