- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Government sources: న్యాయవ్యవస్థపై గౌరవం ముఖ్యం.. విమర్శల నేపథ్యంలో కేంద్రం స్పందన
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ పురోగతికి కీలక సంస్థల మధ్య సహకారం ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ పురోగతికి కీలక సంస్థల మధ్య సహకారం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పులపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. "న్యాయవ్యవస్థ పట్ల గౌరవం అత్యంత ప్రధానం" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. న్యాయ వ్యవస్థ సమగ్రతను కాపాడుకోవడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి. ప్రజాస్వామ్య స్తంభాలన్నీ వికసిత్ భారత్ కోసం కలిసి పనిచేస్తున్నాయని అంది. వివిధ ప్రజాస్వామ్య సంస్థల సహకార ప్రయత్నాలను హైలెట్ చేసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల గురించి మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు తలుపులు తట్టే హక్కు ఉంది" అని చెప్పింది. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య సంబంధాన్ని విడదీయరానిదని వర్ణించాయి. ప్రజాస్వామ్యం అనే నాణఏనికి ఇవి రెండూ బొమ్మా బొరుసు వంటివని పేర్కొంది. దేశంలో న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల వివాదాల వేళ ఈ ప్రకటన రావడం గమనార్హం.
బీజేపీ నేతల విమర్శలు
పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు గడువును నిర్ణయిస్తూ ఇచ్చినన ఉత్తర్వుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ పదే పదే విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సుప్రీం అని.. సుప్రీంకోర్టు అధికారాల గురించి ప్రశ్నలు లేవెనత్తారు. రాజ్యాంగ పరమైన అంశాల్లో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలపై మరోసారి ప్రశ్న లేవనెత్తారు. ఈ అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ధంఖర్ పేర్కొన్నారు. మరోవైపు, ఇదే అంశంపై భాజపా ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఒకవేళ సుప్రీంకోర్టు (Supreme Court) చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.






