- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Resignation: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండే (Dhanunjay Munde) మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ (Santosh Deshmukh) హత్య కేసులో ఆయన సన్నిహితుడు, వ్యకిగత సహాయకుడు వాల్మిక్ కరాద్ (Valmik Karad)ను నిందితుడి పేర్కొన్న నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ సూచన మేరకు ధనుంజయ్ ముండే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన రాజీనామాను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమోదించారు. అనంతరం ముండే రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపించారు.
కాగా, బీడ్ గ్రామానికి చెందిన సర్సంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ (Santhosh Deshmukh)ను గత సంవత్సరం డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఉదంతం అక్కడి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విచారణను ముమ్మరం చేశారు. అయితే, విచారణలో భాగంగా మంత్రి ధనుంజయ్ ముండే (Dhanunjay Munde) అనుచరుడైన వాల్మిక్ కరాద్ (Valmik Karad)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న కరాద్‌ను కలిసేందుకు ధనుంజయ్ ముండేకు సన్నిహితుడైన బాలాజీ తండే (Balaji Tande) కలవడం తీవ్ర వివాదాస్పందమైంది. దీంతో కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధనంజయ్‌పై విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. కేసు దర్యాప్తులో ఉన్నతాధికారులు మ్మక్కయ్యారని ఎన్సీపీ పవార్ వర్గం నేతలు ఆరోపించారు. అదేవిధంగా మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ మంత్రి ధనంజయ్‌ను రాజీనామా చేయమని కోరినట్లుగా సమాచారం.
కేవలం రాజీనామాతో సరిపోదు.. ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామాపై శివసేన (యుబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) మాట్లాడుతూ కేవలం రాజీనామా సరిపోదని అన్నారు. మొత్తం ప్రభుత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయకపోతే, పెట్టుబడుల కోసం మహారాష్ట్రకు ఎవరు వస్తారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు.






