- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: ఉగ్రదాడిని ఖండించిన బంగ్లాదేశ్.. ఉగ్రవాదంపై పోరు కొనసాగిస్తామని వెల్లడి
పెహల్గామ్ ఉగ్రదాడి పై బంగ్లాదేశ్ స్పందిచింది. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటంలో బంగ్లాదేశ్ తన అచంచల నిబద్ధతను పునరుద్ఘాటిస్తోందని వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి పై బంగ్లాదేశ్ స్పందిచింది. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటంలో బంగ్లాదేశ్ తన అచంచల నిబద్ధతను పునరుద్ఘాటిస్తోందని వెల్లడించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ దాడి జరిగిన 24 గంటల తర్వాత ఢాకా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. "భారతదేశంలోని జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడిలో అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయాయి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చింది.
యూనస్ స్పందన
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ కూడా ఉగ్రదాడిపై స్పందించారు. ప్రాణనష్టం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వల్ల చనిపోయిన వారికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. ఈ హేయమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటిస్తున్నా" అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఉగ్రదాడిని ఖండిస్తూ అమెరికా, యూకే, రష్యా, చైనా, సౌదీ అరేబియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఏఈ, ఇరాన్ సహా పొరుగుదేశాలు నేపాల్, భూటాన్, శ్రీలంక ప్రకటను విడుదల చేశాయి. ప్రముఖ ప్రపంచ నాయకులు అందరూ భారత్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండించగా.. బంగ్లాదేశ్ ఇంకా అధికారికంగా ఎందుకు ప్రకటన విడుదల చేయలేదని విదేశాంగ విధాన పరిశీలకులు ప్రశ్నించారు. కాగా.. ప్రపంచదేశాలు స్పందించిన తర్వాత ఆలస్యంగా బంగ్లాదేశ్ ప్రకటన విడుదల చేయడం గమనార్హంగా మారింది






