- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కర్ణాటక నష్టం: కేంద్రంపై సీఎం సిద్దరామయ్య విమర్శలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లిందని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST reforms) వల్ల రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లిందని విమర్శించారు. హాసన్‌లో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 2017లో జీఎస్టీ ని అమలు చేసి అప్పటి నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని గుర్తు చేస్తూ, ఆర్థిక సంవత్సరం మధ్యలో జీఎస్టీ రేట్లు తగ్గించడం వలన 2025 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో నష్టాన్ని చవిచూసిందని తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల చూశాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అహింద (Ahinda) వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతూ, ఈ వర్గాలను వ్యవస్థీకృతం చేయడంలో తాను ప్రధాన పాత్ర పోషించానని సీఎం తెలిపారు. తాము అమలు చేసిన హామీలు (గ్యారెంటీలు), అనేక సంక్షేమ పథకాల ద్వారా కార్మికులు, పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు సహా పలు వర్గాలు లబ్ధి పొందాయని ఆయన వివరించారు. ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పై విమర్శలు గుప్పించిన సిద్ధరామయ్య, రైతు కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, ఆయన వ్యవసాయ రంగానికి చేసిన సేవలు ఏమిటి? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.






