- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukraine: ట్రంప్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధం: ఉక్రెయిన్ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'బలమైన నాయకత్వం’లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ మంగళవారం చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ దిగొచ్చారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన భేటీ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందించే సాయాన్ని నిలిపేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెనక్కి తగ్గారు. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'బలమైన నాయకత్వం’లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ మంగళవారం చెప్పారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు, శాశ్వతంగా శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మొదటిదశలో భాగంగా ఖైదీల విడుదల, క్షిపణులు, లాంగ్-రేంజ్ డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడుల నిషేధానికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశలకు వెళ్లాలని భావిస్తున్నాం. పటిష్టమైన తుది ఒప్పందం జరిగేందుకు అమెరికాతో పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన చర్చ విచారకరమని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. భవిష్యత్తులో సహకారం కోసం, నిర్మాణాత్మకమైన సంప్రదింపులు ఉండాలని కోరుకుంటున్నట్టు జెలెన్‌స్కీ వెల్లడించారు.






