- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reactor: దేశంలోనే తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి
భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్)వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. తమిళనాడు (Thamilnadu) లోని కల్పక్కంలో (Kalpakkam) ఏర్పాటు చేసిన ఈ రియాక్టర్ దేశంలోని మూడు-దశల అణు ప్రాజెక్టుకు చెందిన రెండో దశను ప్రారంభించనుంది. ఇది అణు వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ ప్రారంభించడానికి అటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) అధికారులు అనుమతిచ్చిన రెండేళ్ల తర్వాత ఇది సేవల్లోకి రానుండటం గమనార్హం. ఈ రియాక్టర్‌ను ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) రూపొందించింది. ఇది 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అంతేగాక ఈ రియాక్టర్ ప్లూటోనియం ఆధారిత ఇంధనాన్ని ఉపయోగించడంతో పాటు శీతలీకరణ కోసం ద్రవ సోడియంను వాడుతుంది. అలాగే అత్యవరస పరిస్థితుల్లో ప్లాంట్‌ను సురక్షితంగా మూసివేసేలా తయారు చేశారు. ఇందులో 2026 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. పీఎఫ్‌బీఆర్ భారత అణు కార్యక్రమానికి కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ రియాక్టర్ల నుంచి ఉత్పత్తి చేయబడిన ఇంధనం థోరియం ఆధారిత రియాక్టర్ల మూడో దశలో ఉపయోగించబడుతుంది. కాగా, 2024 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఈ రియాక్టర్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలైలో పరీక్షలకు ఏఈఆర్బీ పర్మిషన్ ఇచ్చింది.






