రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-23 07:52:11  IST  )

బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తీవ్ర ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభలు గందరగోళానికి గురయ్యాయి.

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తీవ్ర ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభలు గందరగోళానికి గురయ్యాయి. రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు నినాదాలతో సభను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ వాయిదా పడిన ఐదు నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభలోనూ విపక్ష సభ్యుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. స్పీకర్ పోడియం వరకు చేరి నినాదాలు చేయడంతో సభను కొనసాగించలేని పరిస్థితుల్లో లోక్‌సభను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్ష సభ్యులు బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చ కోరుతున్నారు. ఈ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story