- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
by Phanindra |
పండుగల వేళ రైల్వేలను టార్గెట్ చేస్తూ ఫేక్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వార్నింగ్ ఇచ్చారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: రైల్వేశాఖను టార్గెట్ చేస్తూ ఫేక్ వీడియోలు సర్కులేట్ చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హెచ్చరించారు. దీపావళి, ఛత్ పూజ పండుగల వేళ రైల్వేస్టేషన్లలో రద్దీని మేనేజ్ చేసే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయని ఆయన పరిశీలించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సడెన్‌గా సందర్శించిన ఆయన.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సదుపాయాలు, పరిశుభ్రత గురించి ప్రజలను అడిగి, వారి సూచనలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైల్వేను టార్గెట్ చేస్తూ ఫేక్ వీడియోలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వీడియోలు షేర్ చేయొద్దని కోరారు. ప్రజల సంక్షేమం, సౌలభ్యాలే తమకు ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
Next Story






