- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naravane Book: మీరే డిసైడ్ చేసుకోండి.. పెంగ్విన్ పబ్లిషర్ ప్రకటనపై రాహుల్ గాంధీ
మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకం వివాదం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె (Naravane) రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పుస్తకంపై జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పుస్తకం పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ (Penguin Random House) చేసిన ప్రకటనపై లోక్‍సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రియాక్ట్ అయ్యారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఈ పుస్తకం అమెజాన్‍లో లభిస్తోందన్నారు. నా పుస్తకం అందరికీ అందుబాటులో ఉందని కొనుగోలు చేయాలంటూ 2023లోనే నరవణే ట్వీట్ చేశారన్నారు. ఈ పుస్తకం విషయంలో పుస్తకం పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి, లేదంటే నరవణే అయినా అబద్ధం చెప్పి ఉండాలన్నారు. నేనైతే నరవణే ట్వీన్‍ను నేను నమ్ముతున్నానన్నారు.
ఎవరిది నిజమో మీరే నిర్ణయించుకోండి:
ఆర్మీ చీఫ్‍గా పని చేసిన నరవణె ఆయన తన పుస్తకంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పెంగ్విన్ పబ్లిషర్ నిజం చెబుతోందా? లేకా నరవణె నిజం చెబుతున్నారా మీరే నిర్ణయించుకోండన్నారు. ఇద్దరిది నిజం అనడం సాధ్యం కాదన్నారు. కాగా నరవణె రాసిన పుస్తక్తంలోని అంశాలను ఇటీవల లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అనంతరం పార్లమెంట్ కు ఆ పుస్తకాన్ని తీసుకువచ్చి ప్రదర్శించారు. అయితే ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని అటువంటిది అనధికారిక పుస్తకంలోని అంశాలను సభ లోపల ఎలా ప్రస్తావిస్తారంటూ రాహుల్ గాంధీపై అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలో ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నరవణె పుస్తకం ఒక్క కాపీ కూడా ఇంకా పబ్లిష్ కాలేదని, అనధికారిక కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని ఈ బుక్ పబ్లిషర్ పెంగ్విన్ స్పష్టం చేసింది. అలాగే ఈ పుస్తకంపై కాపీరైట్ హక్కులు తమకే ఉన్నాయని వీటిని ఉల్లఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేసిన హెచ్చరించింది. పెంగ్విన్ హెచ్చరికల నేపథ్యంలో రాహుల్ గాంధీపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.






