- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ అండమాన్ జైలులో ఉండాలి: సీఎం ఏక్‌నాథ్ షిండే
by Malleboina Mahesh |
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలకు మహారాష్ట్ర ప్రజలు కలత చెందారని.. సావర్కర్ ను విమర్శిస్తున్న రాహుల్.. వీలైతే ఒక్కరోజు అండమాన్ జైలులో శిక్ష అనుభవించాలిని ఏక్ నాథ్ షిండే అన్నారు. సావర్కర్ త్యాగం గురించి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సావర్కర్ గౌరవ్ యాత్రను నిర్వహిస్తామని షిండే చెప్పారు. సావర్కర్‌ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని మహారాష్ట్ర సీఎం అన్నారు. కాగా రాహుల్ గాంధీ ‘నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరు’ అని పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.
Next Story






