- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: లోక్‍సభలో బిగ్ ఫైట్.. ఆర్ఎస్ఎస్ టార్గెట్‍గా రాహుల్ సంచలన వ్యాఖ్యలు
దేశంలోని వ్యవస్థలన్నింటిపైనా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని సమానత్వ భారతం కోసం తపించిన జాతిపితను హత్య చేశారని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నింటిపైనా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతోందని, ఆర్ఎస్ఎస్ కు నచ్చని నిజాలన్నింటిని ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారని దేశంలోని వైవిధ్యాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఇవాళ లోక్‍సభలో ఎస్ఐఆర్ పై మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎన్నికల వ్యవస్థను, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం పూర్తిగా తన గుప్పిట పెట్టుకుందని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఈసీని వాడుకుంటోందన్నారు.
ఓట్ల చోరీకి సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఈసీని బీజేపీ వాడుకుంటోందన్నారు. పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానల్ నుంచి సీజేఐని తొలగించారని ఆరోపించారు.హర్యానాలో ఓటు చోరీ జరిగిందని ఇక్కడి ఓటర్ల జాబితాలో బ్రెజిల్ మహిళ పేరుతో 23 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. యూపీలో లక్షల సంఖ్యలో ఉన్న డూప్లికేట్ ఓట్ల గురించి ఈసీ మాట్లాడం లేదన్నారు. ఈసీ ఇప్పటి వరకూ నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ఏకంగా దేశ ఎన్నికల కమిషన్ ను కూడా వీళ్లు కబ్జా చేశారని ఎన్నికల వ్యవస్థను కలుషితం చేసి తీవ్ర నష్టం చేశారన్నారు. దేశంలోని వర్సిటీలను ఇప్పటికే కబ్జా చేశారు. వర్సిటీలలో వీసీలంతా ఆర్ఎస్ఎస్ వాదులేనన్నారు.
స్పీకర్ ఆగ్రహం:
రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్‍పై చేసిన రోపణలపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వావాదం జరిగింది. ఈ క్రమంలో విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్‍ను మీరు బెదిరించలేరని అన్నారు.






