బాబా బైద్యనాథ్‌ ధామ్‌‌లో రాహుల్‌‌‌గాంధీ ప్రత్యేక పూజలు

by Dishanational4 |
బాబా బైద్యనాథ్‌ ధామ్‌‌లో రాహుల్‌‌‌గాంధీ ప్రత్యేక పూజలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌ జిల్లాలో ఉన్న బాబా బైద్యనాథ్‌ ధామ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్‌లోకి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రవేశించి శనివారంతో రెండోరోజు పూర్తయింది. ఇక రాష్ట్రంలో నిర్వహించిన ఒక భారీ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరుస్తున్నాయి. బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. ఈ విద్వేషం, హింసకు వ్యతిరేకంగా మేం 4వేల కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టాం. బీజేపీ వాళ్లు ఎంత విద్వేషాన్ని చిమ్మినా.. మేం మాత్రం ప్రేమనే పంచుతాం’’ అని పేర్కొన్నారు. తదుపరిగా రాహుల్ గాంధీ యాత్ర ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌ల మీదుగా సాగి చివరకు మహారాష్ట్రలో ముగుస్తుంది.




Next Story
null