రాహుల్‌కు 3 సంవత్సరాల పాస్‌పోర్ట్ జారీ

by Dishaweb |
రాహుల్‌కు 3 సంవత్సరాల పాస్‌పోర్ట్ జారీ
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మూడేళ్లు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ను మంజూరు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ కోర్టు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాస్‌పోర్ట్ జారీ అయింది. సాధారణ పాస్‌పోర్ట్‌కు 10 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. అయితే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మూడేళ్ల పాస్‌పోర్ట్ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారు. అయితే పదేళ్ల పాస్‌పోర్ట్‌ను ఇవ్వలేమని.. మూడేళ్ల పాస్‌పోర్ట్‌ను ఇవ్వగలమని రాహుల్‌కు కోర్టు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా.. స్వామి ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు క్రాస్ ఎగ్జిమినేషన్ దశలో ఉంది. రాహుల్ లేదా ఆయన తరఫు న్యాయవాది క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతున్నారు.

రాహుల్ సోమవారం యునైటెడ్ స్టేట్స్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలలో యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యూఎస్ క్యాపిటల్‌లో చట్టసభ సభ్యులను కలుస్తారు. డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసిన తర్వాత రాహుల్ కొత్త సాధారణ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు దాఖలైన పరువునష్టం కేసులో ఆయన దోషిగా తేలారు. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. కానీ ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి:

మా తాతకు మంత్రి పదవి ఇప్పించండి.. రాహుల్ గాంధీకి లెటర్ రాసిన బాలిక

Next Story