మా తాతకు మంత్రి పదవి ఇప్పించండి.. రాహుల్ గాంధీకి లెటర్ రాసిన బాలిక

by Javid Pasha |
మా తాతకు మంత్రి పదవి ఇప్పించండి.. రాహుల్ గాంధీకి లెటర్ రాసిన బాలిక
X

దిశ, వెబ్ డెస్క్: తమ తాతకు మంత్రి పదవి కావాలంటూ ఓ బాలిక ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకే లెటర్ రాసింది. మంత్రి పదవికి తమ తాత అన్ని విధాల అర్హుడని ఆ లెటర్ లో పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం 24 మంది మంత్రులతో సిద్ధరామయ్య సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత టీబీ జయచంద్రకు మంత్రి మండలిలో స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే ఆయన మనుమరాలు ఆర్ణా సందీప్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లెటర్ రాసింది.

‘‘ డియర్ రాహుల్ గాంధీ, నేను టీబీ జయచంద్ర మనుమరాలిని. మా తాతకు మంత్రి పదవి రానందుకు నేను చాలా బాధపడుతున్నా. మంత్రి పదవికి మా తాత అన్ని విధాల అర్హుడు. మా తాత చాలా దయాహృదయం కలవాడు. అలాగే ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి. మా తాతకు మంత్రి పదవి ఇప్పించండి ప్లీజ్’’ అంటూ ఆమె ఆ లెటర్ లో రాహుల్ ను వేడుకుంది. కాగా తమ తాత కోసం ఈ బాలిక రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

రాహుల్‌కు 3 సంవత్సరాల పాస్‌పోర్ట్ జారీ

Next Story

Most Viewed