- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుష్పరిపాలనకు మధ్యప్రదేశ్ కేంద్రంగా మారింది.. ఇండోర్ మరణాలపై రాహుల్ ఫైర్
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో కలుషిత నీరు తాగి పలువురు మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో కలుషిత నీరు తాగి పలువురు మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాహుల్ తన ఎక్స్ పోస్ట్‌లో.. ఇండోర్‌లో పరిపాలన కుంభకర్ణుడిలా నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి దుఃఖం వ్యాపించిందని, పేదలు నిస్సహాయులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి దుర్వాసన వెదజల్లుతున్న నీటి గురించి ప్రజలు పదే పదే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తాగునీటిలో మురుగు నీరు ఎలా కలిసిందని ప్రశ్నించారు. నీటి సరఫరాను సకాలంలో ఎందుకు నిలిపివేశారని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఇవి ప్రశ్నలు కాదని కచ్చితంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పరిశుభ్రమైన నీరు అందించడం ప్రజలకు జీవించే హక్కు అని స్పష్టం చేశారు. ఈ హత్యలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, దాని నిర్లక్ష్య పరిపాలన మరియు నిర్లక్ష్య నాయకత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. మధ్యప్రదేశ్ దుష్పరిపాలనకు కేంద్రంగా మారిందని ఓ చోట దగ్గు సిరప్ మరణాలు మరో చోట ఆస్పత్రుల్లో ఎలుకలు పిల్లల ప్రాణం తీస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు మురుగునీటి వల్ల ప్రాణాలు పోయినా మోడీజీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇండోర్ లో కలుషిత నీరు కారణంగా 11మంది మరణించారు. మరో వెయ్యిమంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.






