- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు ఒక్కరోజులో ఊహించని షాక్ తగిలింది. రాఘవ్ చద్దా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్ల నుండి పది లక్షల మంది అన్ ఫాలో చేశారు. చద్దాకు ఇది వరకు 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా 24 గంటల్లో (శనివారం మధ్యాహ్నానికి) ఆ సంఖ్య 13.4 మిలియన్లకు చేరుకుంది. ముఖ్యంగా చద్దా స్పీచ్ లకు ఆకర్షితులై ఎక్కువగా ఆయనను ఫాలో చేసింది జెన్ జీ యువతనే. కానీ పార్టీ మారడంతో వాళ్లే ఎక్కువగా అన్ ఫాలో చేసినట్టు తెలుస్తోంది. రాఘవ్‌కు వ్యతిరేకంగా ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున 'అన్‌ఫాలో' క్యాంపెయిన్ నడుస్తోంది. అంతే కాకుండా బీజేపీని వ్యతిరేకించేవాళ్లు సైతం ఆయన ఫాలోవర్ల లిస్టు నుండి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. ఇక చద్దా పార్టీ మారిన తరవాత బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ స్టాలో పెట్టిన 62 పోస్టులను సైతం డిలీట్ చేశారు.
చద్దా పార్టీ మారడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. చద్దా పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని అంటున్నారు. ఆమ్ ఆద్మీని చద్దా మోసం చేశాడని విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు రాజ్యసభలో సామాన్యుల సమస్యల గురించి మాట్లాడిన చద్దా.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ సమస్యలపై ఇక ప్రశ్నించరేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ చూసి ఓట్లు పడతాయని చద్దా భ్రమ పడుతున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.
యూత్ ఐకాన్ ఇమేజ్‌కు డ్యామేజ్
రాఘవ్ చద్దా రాజకీయాల్లో ఒక విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా.. సామాన్యులను ఇబ్బంది పెట్టే పెటర్నిటీ లీవ్స్, ట్రాఫిక్ సమస్యలు, టెలికాం కంపెనీల డేటా పరిమితులు, ఎయిర్‌పోర్టుల్లో ఖరీదైన సమోసాలు, గిగ్ వర్కర్ల సమస్యల వంటి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించి యువతకు చేరువయ్యారు. చివరకు బ్లింకిట్ (Blinkit) డెలివరీ బాయ్‌గా ఒక్కరోజు పనిచేసి వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని, 10 నిమిషాల డెలివరీ గడువును కేంద్రం తొలగించేలా పోరాడి 'యూత్ ఐకాన్'గా ఎదిగారు.
అన్‌ఫాలో రాఘవ్ చద్దా.. ట్రెండింగ్
రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం వెనుక ఉన్న స్వార్థంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇంటర్నెట్ నిన్ను రాత్రికి రాత్రే హీరోని చేయగలదు, అదే ఇంటర్నెట్ నిన్ను జీరోని కూడా చేయగలదు" అంటూ ఎన్సీపీ (ఎస్పీ) అధికార ప్రతినిధి అనీష్ గవాండే విమర్శించారు. ప్రముఖ మౌంటెనీర్ రోహ్తాష్ ఖిలేరి వంటి వారు కూడా చద్దాను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం #unfollowRaghavChadha అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది.
భవిష్యత్తుపై సందిగ్ధత
గతంలో రాఘవ్‌ను కొందరు అభిమానులు సొంతంగా 'జెన్-జీ పార్టీ' పెట్టమని సూచించినప్పుడు ఆయన ఆసక్తి చూపారు. వేరే పార్టీలో చేరితే ప్రజల నుంచి ద్వేషం ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పట్లోనే ఒక నెటిజన్ హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. డేటా ఆధారంగా రాజకీయాలు చేసే రాఘవ్ చద్దా, పడిపోతున్న తన పాపులారిటీ గ్రాఫ్‌ను మళ్లీ ఎలా పెంచుకుంటారో వేచి చూడాలి. మొత్తానికి మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన చద్దా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎలా పనిచేస్తాడో చూడాలి మరి.






