- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: ట్రంప్ తో మాట్లాడేందుకు పుతిన్ రెడీ.. వెల్లడించిన క్రెమ్లిన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఫోన్ లో మాట్లాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) రెడీగా ఉన్నారని క్రెమ్లిన్ పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఫోన్ లో మాట్లాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) రెడీగా ఉన్నారని క్రెమ్లిన్ పేర్కొంది. వాషింగ్టన్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. “పుతిన్ వీలైనంత త్వరగా అణ్వాయుధాలను తగ్గించే చర్చలను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఫ్రాన్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూడా అణ్వాయుధ సామార్థ్యాలు తగ్గించుకునేందుకు గతంలో కంటే విస్తృతంగా ఇలాంటి చర్చలు జరపాలి. మేం ఇంతకు ముందు ఇలాంటి చర్చలు జరపేందుకు ఆసక్తి కనబరిచాం. కానీ, అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యూఎస్ మా దేశంతో అన్నిరకాల సంబంధాలను తెంచుకుంది. ఇప్పుడు వాషింగ్టన్ కోర్టులో బాల్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి ”అని పెస్కోవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో ఇరుదేశాల అధినేతల మధ్య భేటీ ఉంటుందా? అనే విషయంపై మాత్రం క్రెమ్లిన్ క్లారిటీ ఇవ్వలేదు.
ట్రంప్ ఏమన్నారంటే?
ఇకపోతే, దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానని చెప్పుకొచ్చారు. చమురు ధరలు తగ్గితే యుద్ధం మరింత త్వరగా ముగుస్తుందన్నారు. అయితే, చమురు ధరలకు, యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేదని రష్యా ప్రకటించింది. మరోవైపు, అమెరికా- రష్యా మధ్య అణ్వాయుధాలకు సంబంధించిన ఒప్పందం ఫిబ్రవరి 5, 2026లో ముగియనుంది. ఇలాంటి సమయంలో ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఆసక్తిగా మారింది.






