Putin: మరోసారి చర్చనీయాంశంగా పుతిన్ తీరు..!

by Shamantha N |   (  Updated:2025-03-19 15:29:55  IST  )

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధానికి (Russia-Ukraine war) ముగింపు పలకడానికి పుతిన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం గంటకుపైగా ఫోన్‌లో చర్చలు జరిపారు.

Putin: మరోసారి చర్చనీయాంశంగా పుతిన్ తీరు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధానికి (Russia-Ukraine war) ముగింపు పలకడానికి పుతిన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం గంటకుపైగా ఫోన్‌లో చర్చలు జరిపారు. అయితే, పుతిన్ ట్రంప్ ని గంటసేపు వెయిట్ చేయించారని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఫోన్‌ చేసిన సమయంలో ఆయన మాస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో ఉన్నారని పేర్కొన్నాయి. అయితే, రష్యన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఇరుదేశాధినేతల మధ్య కాల్ షెడ్యూల్ అయ్యింది. పారిశ్రామిక వేత్తల సమావేశంలో రష్యన్ యూనియన్ ఫర్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అధిపతి అలెగ్జాండర్ షోఖిన్ ఆ సమయాన్ని గమనించారని ది సన్ మీడియా నివేదించింది. అయితే, రష్యా అధ్యక్షుడి ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్‌ (Dmitri Peskov) మీటింగ్ మధ్యలో పుతిన్ కి ట్రంప్ కాల్ గురించి చెప్పినట్ల వీడియో బయటకు వచ్చింది. అయితే, షోఖిన్ పుతిన్ ని లేట్ అవుతుందా అని అందులో కన్పిస్తుంది. కాగా.. పుతిన్ ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. "అతని మాట వినవద్దు! అదే అతని పని" అని పుతిన్ భుజాలు తడుముకుంటూ అక్కడ నవ్వులు పూయించారు. వెంటనే, దీనికి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తారో అని షోఖిన్ అడగ్గా.. "నేను ట్రంప్ గురించి కాదు.. పెస్కోవ్ గురించి మాట్లాడుతున్నాను" అని పుతిన్ బదులిచ్చారు.

రెండు గంటలు ఆలస్యంగా చర్చలు..

మరోవైపు, యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య మంగళవారం జరిగిన చర్చలు దాదాపు రెండు గంటలు ఆలస్యమయ్యాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వెల్లడించింది. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్‌ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపివేసేలా చూడాలని అమెరికా, రష్యా నిర్ణయించాయని పేర్కొంది. ట్రంప్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారమే అప్పగించుకోనున్నట్లు ట్రంప్‌నకు పుతిన్‌ చెప్పారని వెల్లడించింది. అమెరికా సహా దాని మిత్రపక్షాలు ఉక్రెయిన్‌కు చేస్తున్న సైనిక సాయాన్ని ఆపేయాలని పుతిన్‌ పట్టుబట్టినట్లు క్రెమ్లిన్‌ పేర్కొంది. అయితే, ఈ చర్చలకు ఉక్రెయిన్‌ అనుమతి ఉందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Read More..

Bill Gates: కేంద్రమంత్రి జేపీ నడ్డాతో బిల్ గేట్స్ చర్చలు

Next Story