పాక్ ప్రధానిని ఘోరంగా అవమానించిన పుతిన్

by Muthe.Rajitha |

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఘోర అవమానం జరిగింది.

పాక్ ప్రధానిని ఘోరంగా అవమానించిన పుతిన్
X

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఘోర అవమానం జరిగింది. అది కూడా అంతర్జాతీయ వేదిక మీద ఎదురైంది. అయితే తుర్కెమిస్తాన్ లో జరిగిన ఫోరమ్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో సమావేశం కోసం 40 నిముషాలు ఎదురు చూశారు. అయితే అప్పటికే మరో మీటింగ్ లో ఉన్న పుతిన్ సమావేశం నుంచి బయటకి రాలేదు. దీంతో సహనం కోల్పోయిన షెహబాజ్.. పుతిన్ సమావేశ రూమ్ లోకి నేరుగా వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత షెహబాజ్ బయటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. పరువు మొత్తం పోయిందిగా అని పాక్ ప్రధానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Next Story