అర్ధనగ్నంగా 55 ఏళ్ల మహిళ ఊరేగింపు

by Hajipasha |
అర్ధనగ్నంగా 55 ఏళ్ల మహిళ ఊరేగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో అమానుషం జరిగింది. 55 ఏళ్ల మహిళపై ఆమె కొడుకు అత్తమామల కుటుంబీకులు దాడికి తెగబడ్డారు. ఆమెను అర్ధనగ్నంగా చేసి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు మహిళ కుమారుడు గత నెలలో ఓ మహిళతో పెళ్లి చేసుకొని ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మహిళ కుమారుడి అత్తింటి వారు దాడికి పాల్పడ్డారు. మహిళపై దాడిచేసి.. ఆమె బట్టలు చింపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మహిళ అర్ధనగ్న వీడియోను తొలగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Next Story