- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pune Rape Case : పూణె అత్యాచార నిందితుడి అరెస్ట్ !
పూణెలో బస్సులో యువతిపై అత్యాచారాని(Pune Rape Case)కి పాల్పడి పారిపోయిన నిందితుడు(Accused) దత్తాత్రయ రాందాస్(Dattatreya Ramdas 36) ఎట్టకేలకు పోలీసుల(Arrested)కు చిక్కాడు.

దిశ, వెబ్ డెస్క్ : పూణెలో బస్సులో యువతిపై అత్యాచారాని(Pune Rape Case)కి పాల్పడి పారిపోయిన నిందితుడు(Accused) దత్తాత్రయ రాందాస్(Dattatreya Ramdas 36) ఎట్టకేలకు పోలీసుల(Arrested)కు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత అతను పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి కోసం పూణె సమీప ప్రాంతాల్లో దాదాపు 13 పోలీస్ బృందాలు పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేపట్టారు. అయితే పూణె సమీప గ్రామాల్లో చెరుకు తోటలలో నిందితుడు దాగి ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు.
ఆ దిశగా పోలీసులు నిందితుడి కోసం వేట సాగించారు. అప్పటికే నిందితుడి ఆచూకీ చెబితే రూ. లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలితో నిందితుడు చెరుకు తోటల నుంచి బయటకు వచ్చి ఓ ఇంటికి వెళ్లగా..ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి నిందితుడు దత్తా్త్రేయ రాందాస్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు రాందాస్ పలు నేరాల్లో జైలులో ఉంటూ బెయిల్ పై వచ్చాడు.
ఆ వెంటనే బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలను నియమించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని..బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.






