ఇండియా అనేది ఇంగ్లీష్ పదం కాదు.. కావాలనే బీజేపీ వివాదం: ప్రొఫెసర్ హరగోపాల్

by Disha Web Desk 19 |
ఇండియా అనేది ఇంగ్లీష్ పదం కాదు.. కావాలనే బీజేపీ వివాదం: ప్రొఫెసర్ హరగోపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తుందని మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అని బీజేపీ అన్న కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఎంతో శ్రమ అవసరం.. కానీ బీజేపీ మాత్రం సామాజిక, అట్టడుగున ఉండే వారి ప్రస్తావన కన్నా.. కల్చర్, సాంస్కృతిక జీవనానికి సంబంధించి వారు నిరంతరంగా ఏదో ఒక వివాదాన్ని తెర తీస్తున్నారు. సమాజంలో దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చకు ప్రజల జీవన విధానానికి పెద్దగా సంబంధం లేదని విమర్శించారు. ఇండియా, భారత్ అనేది రాజ్యాంగం అంగీకరించింది. ఇండియా, భారత్ అంటూనే ఉన్నాం.

ప్రతిపక్షాలు ఇండియా అని కూటమి పెట్టుకోవడంతో బీజేపీకి విశ్వాసం దెబ్బతిన్నట్లు కనిపిస్తుందని అన్నారు. ఇండియా అనే పదం ఇంగ్లీష్ లాగా కనిపించిన.. ఇండస్ సివిలైజేషన్( సింధూ నాగరికత) నుంచి వచ్చిందన్నారు. ఇండియానే నిజానికి మన నాగరికతకు ఆ పేరు అని చెప్పారు. భరతుడు పాలించాడు కాబట్టి భారత్ అని పెట్టిన ఇది రాచరిక వ్యవస్థ కాదు కాబట్టి.. మన నాగరికతకు సంబంధించిన పదం ఇండియాగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని ఈ వివాదం క్రియేట్ చేస్తున్నారని, ఇండియా అనే వారు విదేశస్తులు, భారత్ అనే వారు దేశ భక్తులు అని క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఇండియా అనేది విదేశీ పదం కాదన్నారు. ఓ పరిణామ క్రమంలో ఇండియాగా మారిందని అందులోనే హిందూ, ఇండస్ సివిలైజేషన్ (సింధూ నాగరికత) ఉందని వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన చర్చలు జరగాలి.. కానీ వీటిపై చర్చలు అవసరం లేదన్నారు.

Next Story

Most Viewed