- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యత ఎవరిది? ఎవరైనా రాజీనామా చేశారా? : లోక్‌సభలో ప్రియాంక గాంధీ
లోక్ సభలో రెండోరోజు పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై చర్చ వాడివేడిగా జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభలో రెండోరోజు పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై చర్చ వాడివేడిగా జరుగుతోంది. జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెప్తుండటాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (MP Priyanka Gandhi) ప్రశ్నించారు. అక్కడ పరిస్థితులు అంతా నార్మల్గా ఉంటే ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. పహల్గాంలో పర్యాటకుల వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరని అధికార పక్షాన్ని ఆమె నిలదీశారు. ఇది పూర్తిగా నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా ? అని సూటి ప్రశ్నలు సంధించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారు? హోంమంత్రిదా? ప్రధానమంత్రిదా? అని ప్రియాంక వరుస ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నా.. టీఎఆర్ఎఫ్ వరుస దాడులు చేస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పహల్గామ్ ఘటనపై గంటన్నరసేపు అనేక విషయాలు ప్రస్తావించారని, ఒక పాయింట్ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. పట్టపగలే ఉగ్రదాడి ఎందుకు, ఎలా జరిగిందన్న విషయంపై ఆయన వివరణ ఇవ్వలేదని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు.






