కాసేపట్లో లక్నోకు ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ప్రేరణ స్థల్‌’ ప్రారంభోత్సవం

by Kema Shiva Kumar |

మాజీ ప్రధాని, భారతరత్న బహుమతి పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (Lucknow)లో పర్యటించనున్నారు.

కాసేపట్లో లక్నోకు ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ప్రేరణ స్థల్‌’ ప్రారంభోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని, భారతరత్న బహుమతి పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (Lucknow)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే, రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను దేశ మహానేతల జీవితాలు, ఆదర్శాలను స్మరించుకునేలా రూపొందించారు.

ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయలకు నివాళి అర్పించే విధంగా దానిని నిర్మించారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సముదాయంలో 65 అడుగుల ఎత్తైన ముగ్గురి నేతల కాంస్య విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అదనంగా కమలం ఆకారంలో అత్యాధునిక మ్యూజియం కూడా ఉంది. ఇది భారత జాతీయ ప్రయాణం, నాయకత్వ వారసత్వాన్ని ప్రదర్శించేలా రూపొందించారు. దేశ మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం నిరాడంబర నాయకత్వం, మంచి పాలన ఆదర్శాలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉండటంలో లక్నో పోలీస్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ 25న ‘సుశాసన దినోత్సవం’గా జరుపుకుంటారు.

Next Story