- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టైమ్, డేట్ రెండూ భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది.. ప్రధాని మోడీ సంచలన ప్రకటన
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terror Attack)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terror Attack)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), త్రివిధ దళాల అధిపతులు.. సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సహా పలువురు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని.. కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి(Indian Army) పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. పెహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అన్నారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు.. వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబు ఇస్తామని.. ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. మళ్లీ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా సైన్యం స్ట్రాంగ్ రివేంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకుందంటూ హాట్ కామెంట్స్ చేశారు.






