బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

by Gantepaka Srikanth |

హిమాచల్ బస్సు ప్రమాదం(Bus Accident)పై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు.

బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ బస్సు ప్రమాదం(Bus Accident)పై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు. ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఓ టూరిస్టు బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 30-35మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారాలను ఆదేశించారు.

Next Story