- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. తమిళనాడు తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
తమిళనాడులోని కరూల్ లో దళపతి, టీవీకే పార్టీ అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూల్ లో దళపతి, టీవీకే పార్టీ అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించడం దురదృష్టకరమని ఎక్స్(X)లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా.. విజయ్ సభకు అనుమతికి మించి అభిమానులు రావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. కార్నర్ మీటింగ్ నిర్వహించాల్సిన సమయం కంటే.. విజయ్ 7 గంటలు ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.






