- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిన ఈ పోటీల్లో 18 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రపంచ స్థాయి పోటీలు, బలమైన ప్రత్యర్థుల మధ్య భారత్ రికార్డు స్థాయి పతకాలు సాధించడం ఈ టోర్నమెంట్‌ను మరింత విశేషంగా నిలిపింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మన అథెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని స్పందిస్తూ.. "భారత అథ్లెట్లు వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 పతకాలు, అందులో 9 స్వర్ణాలు, అనేక రజత–కాంస్యాలు సాధించి ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత ప్రతిభను మరోసారి నిలబెట్టారు.
శారీరక–మానసిక దృఢత, కఠిన సాధన, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే ధైర్యం – ఇవన్నీ కలసి భారత బాక్సర్ల ఈ గర్వకారణ విజయానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని అత్యుత్తమ బాక్సర్లతో తలపడుతూ, మెడల్స్ ట్యాలీలో టాప్ ర్యాంక్‌ను అందుకోవడం భారత బాక్సింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది." అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. అలాగే ఈ విజయాలు భారత క్రీడా రంగంలో పెరుగుతున్న శక్తి, యువ అథ్లెట్లలోని ప్రతిభ, ప్రభుత్వం, క్రీడా సంస్థలు అందిస్తున్న సహకారం అన్నీ కలిసి సాధించిన ఫలితం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాక్సర్ల అద్భుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారి కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్ పోటీల్లో కూడా ఇలాగే భారత గర్వాన్ని ప్రపంచానికి చూపించాలని ప్రధాని సహా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.






