ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 17:19:19  IST  )

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నియకయ్యారు.

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నియకయ్యారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు సీపీ రాధాకృష్ణకు అభినందనలు తెలుపారు. సమాజ సేవకు, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు రాధాకృష్ణన్‌ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే, పార్లమెంటరీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే అత్యుత్తమ ఉప రాష్ట్రపతిగా నిలుస్తారని విశ్వసిస్తున్నానని అన్నారు. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్‌ దశాబ్దాల అనుభవం దేశ పురోగతికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన పదవీకాలం విజయవంతంగా, ప్రభావవంతంగా కొనసాగాలని కామెంట్ చేశారు. సమాజంలోని అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నేత రాధాకృష్ణన్‌ అని కేంద్ర హోం మంత్రి అమిత్ అన్నారు. ఆయన సూక్ష్మబుద్ధి, పాలనపారమైన అనుభవం పార్లమెంటరీ ప్రజాస్వామ్య బలోపేతానికి, అణగారిన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణకు ఏఐసీసీ చీఫ్ మల్లకార్జన ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాల నైతికతను ఆయన కాపాడుతారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అధికారవర్గం ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు, గౌరవం అందిస్తారని ఆశిస్తున్నా్మని మల్లికార్జున ఖర్గే కామెంట్ చేశారు. ఇక మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొత్త ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌‌కు శుభాకాంక్షలు తెలుపడం కొస మెరుపు.

Next Story