- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 మంది నర్సులకు ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు అందించిన ప్రెసిడెంట్ ముర్ము
15 మంది నర్సులకు ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులను ప్రెసిడెంట్ ముర్ము అందించారు. అవార్డు గ్రహీతల్లో ఏపీకి చెందిన నర్సు కూడా ఒకరు కావడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: సమాజానికి అత్యుత్తమ సేవలందించిన నర్సులు, నర్సింగ్ ప్రొఫెషనల్స్‌కు అందించే ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2025’ ఈసారి 15 మందికి దక్కింది. వీరంతా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిలో బెంగళూరులోని నిమ్‌హాన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) అసిస్టెంట్ నర్సింగ్ సూపరిండెంట్ డాక్టర్ బాను ఎంఆర్, ఈ ఏడాది రిటైరయిన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వలివేటి సుభావతి, తమిళనాడుకు చెందిన కె అలమేలు, మంగయార్కరాశి తదితరులు ఉన్నారు.
వీరితోపాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు నర్సులు, పుదుచ్చేరికి చెందిన ఒక నర్సు కూడా అవార్డులు అందుకున్నారు. 1973 నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అవార్డులను అందిస్తోంది. ఈ అవార్డు గ్రహీతలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలియజేశారు.






