- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prayagraj:ఇక ఇక్కడికి రావడం ఆపండి.. భక్తులకు ప్రయాగ్ రాజ్ వాసి అభ్యర్థన
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. ముంగిపు దశకు చేరుకున్నప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గడం లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. ముంగిపు దశకు చేరుకున్నప్పటికీ భక్తుల రాక మాత్రం తగ్గడం లేదు. కాగా.. దీనిపైనే స్థానికుడు చేసిన పోస్టు వైరల్ గా మారింది. మహాకుంభమేళా ముగిసే సమయంలోనూ జనాలు పోటెత్తుతున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. కుంభమేళాకు రావడం ఇక ఆపండని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సోషల్ మీడియా పోస్టులో కోరాడు. ఆ పోస్టులో.. ‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ప్రయాగ్‌రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు. భక్తులు ఎందుకు పెరుగుతున్నారో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్‌రాజ్‌కు ఇక ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న గల్లీలు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు’ అని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు.
రద్దీ ఎవరి వల్ల?
ముఖ్యంగా అత్యంత దారుణమైన, కోపం తెప్పించే సంఘటన ఏంటనేది వివరిస్తూ సోషల్ మీడియాలో ప్రయాగ్ రాజ్ స్థానికుడు పోస్టు పెట్టాడు. ప్రయాగ్ రాజ లో నెలకొన్న రద్దీకి స్థానికులను నిందిస్తున్నారని అతడు చెప్పుకొచ్చాడు. సాధారణ పరిస్థితి నెలకొనాలంటే.. భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. భక్తులను కోరుతూ.. “దేవుడి కోసం రావడం ఆపండి. గంగా, త్రివేణి సంగమం ఎక్కడికీ వెళ్లట్లేదు. మీరు తర్వాత ప్రశాంతంగా రావచ్చు. ప్రయాగ్ రాజ్ నగర ప్రజలపై కొంత దయ చూపండి.మిమ్మల్ని మేం వేడుకుంటున్నాం" అని ఆ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. కాగా.. త్రివేణి సంగమంలో దాదాపు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటికే 62 కోట్ల మంది గంగాస్నానాలు ఆచరించారు.






