AIIMS: ధంఖర్ ఆరోగ్యంగా ఉండాలి.. త్వరగా కోలుకోవాలి- మోడీ

by Shamantha N |

ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Jagdeep Dhankar) ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పరామర్శించారు.

AIIMS: ధంఖర్ ఆరోగ్యంగా ఉండాలి.. త్వరగా కోలుకోవాలి- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Jagdeep Dhankar) ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పరామర్శించారు. ధంఖర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ధంఖర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇకపోతే, ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధంఖర్ ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (CCU)లో చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ట్రీట్మెండ్ జరుగుతోంది. కాగా.. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు, ప్రధాని మోడీకి ముందే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

Next Story