నా జీవితం నాశనం చేశారు..లాలూ ఫ్యామిలీపై మాజీ కోడలు సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |

అన్నీ తెలిసే త‌న జీవితం నాశనం చేశారు అంటూ బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఫ్యామిలీపై ఆయన మాజీ కోడ‌లు ఐశ్వ‌ర్యా రాయ్ ఆరోపణలు చేశారు.

నా జీవితం నాశనం చేశారు..లాలూ ఫ్యామిలీపై మాజీ కోడలు సంచలన ఆరోపణలు
X

దిశ‌, వెబ్ డెస్క్: అన్నీ తెలిసే త‌న జీవితం నాశనం చేశారు అంటూ బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఫ్యామిలీపై ఆయన మాజీ కోడ‌లు ఐశ్వ‌ర్యా రాయ్ ఆరోపణలు చేశారు. లాలూ పెద్ద‌కుమారుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ ఓ మ‌హిళ‌తో 12ఏళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నానని చెబుతూ ఫోటోను షేర్ చేయడం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో భార్య ఉన్నప్పటికీ ప్రతాప్ యాదవ్ మరో మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉండటంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ క్రమంలో అతడిని లాలూ ప్రసాద్ యాదవ్, పార్టీ నుండి ఇంటి నుండి 6ఏళ్ల పాటూ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈ పరిణామాలపై ప్రతాప్ యాదవ్ మాజీ భార్య ఐశ్వర్య యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాళ్ల కుటుంబానికి అన్నీ తెలిసి కూడా అతడితో వివాహం జరిపించి తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశారని ప్రశ్నించారు. తనను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. వాళ్లంతా కలిసే ఉన్నారని విడిపోలేదని అన్నారు. త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయని అందుకోసమే ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. తన విడాకుల గురించి తనకు మీడియాలో వార్తలు వచ్చిన తరవాతనే తెలిసిందన్నారు.

ప్రతి సమాచారం మీడియాలో వచ్చిన తరవాతనే తెలిసిందని చెప్పారు. ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని చెప్పారు. తన జీవితంతో ఎందుకు ఆడుకున్నారో లాలూ ఫ్యామిలీని అడగాలని అన్నారు. తనను హింసించినందుకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. చేసిందంతా వాళ్లు చేసి తనపై నింధలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడు 12ఏళ్ల నుండి మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను బ్లేమ్ చేశాడని అన్నారు. ఇంకా తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పారు.

Next Story