- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్.. ఫోన్ పే లో రూ.5000 గిఫ్ట్ వచ్చిందా?
సంక్రాంతి పండుగ వేళ.. వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఫోన్ పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ పేరుతో.. తమ వినియోగదారులందరికీ రూ.5000 ఇస్తున్నట్లు లింక్ షేర్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వేళ.. వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఫోన్ పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ పేరుతో.. తమ వినియోగదారులందరికీ రూ.5000 ఇస్తున్నట్లు లింక్ షేర్ అవుతోంది. ఆ లింక్ ఓపెన్ చేసిన యూజర్లలో కొందరికి 404 ఎర్రర్, మరికొందరికి ఆ మెసేజ్ ను 5 గ్రూపులు లేదా 15 మందికి వాట్సప్ ద్వారా షేర్ చేయాలని చూపిస్తోంది. అలా షేర్ చేసిన మెసేజ్ లో "మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ.. నిజంగా నాకు రూ.50,000 వచ్చింది. మీరు కూడా ప్రయత్నించి చూడండి." అని లింక్ వస్తోంది. ఇలాంటి లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులకు ఆశపడి లింకుల్ని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఆల్రెడీ ఈ మెసేజ్ వస్తే డిలీట్ చేయండి. వేరే గ్రూపు లేదా మీ స్నేహితుల నుంచి మెసేజ్ వస్తే వారిని కూడా అలర్ట్ చేయండి. లింక్ ఓపెన్ చేసి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకండి.






