వచ్చే నెలలో మోడీ-ట్రంప్ భేటీ.. న్యూయార్క్ వెళ్లనున్న భారత ప్రధాని

by Phanindra |

వచ్చే నెలలో మోడీ-ట్రంప్ భేటీ జరిగే అవకాశం ఉంది. యూఎన్‌జీఏ సమావేశం కోసం భారత ప్రధాని న్యూయార్క్ వెళ్లనున్నారు.

వచ్చే నెలలో మోడీ-ట్రంప్ భేటీ.. న్యూయార్క్ వెళ్లనున్న భారత ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్ అదనపు సుంకాల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి యూఎస్ వెళ్లనున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశం కోసం ఆయన యూఎస్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో కూడా మోడీ భేటీ అవుతారని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల ఏర్పడిన సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ పర్యటనలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్‌స్కీ తదితర విదేశీ లీడర్లతో కూడా మోడీ కీలక చర్చలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబరులో న్యూయార్క్ సిటీ వేదికగా యూఎన్‌జీఏ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అంతర్జాతీయ దేశాధినేతలు సెప్టెంబరు 23 నుంచి యూఎస్ రావడం మొదలవుతుందని తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ప్రధాని మోడీ యూఎస్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ట్రంప్‌తో కీలక భేటీ నిర్వహించిన మోడీ.. ఏడు నెలల తర్వాత మరోసారి అమెరికా అధ్యక్షుడితో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

Next Story