- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పాకిస్తాన్ గుండెల మీద దాడి చేశాం’.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోడీ సమాధానం
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. కేంద్రం, సైన్యానికి అన్ని పక్షాలు అండగా నిలిచాయి. మన సైన్యం సైతం గొప్పగా పోరాడింది. దేశ భద్రతపై మేం కేంద్రానికి అండగా ఉంటాం. అయితే ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ మాత్రం కేవలం 22 నిమిషాల్లోనే ముగిసింది. పాకిస్తాన్‌కు మోడీ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. సైతం చేతులను మోడీ కట్టేశారు. సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయడమే ఇందుకు నిదర్శనం. దీనిపై ప్రధాని మోడీ(PM Modi) తప్పకుండా సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. తాజాగా మోడీ స్పందించి సమాధానం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. సిందరూ శపథం నెరవేర్చినందుకు భారత సైన్యం ధైర్య సాహసాలకు ఈ సమావేశాలు విజయోత్సవాలు. దేశమంతా విజయోత్సవాల గురించి మాట్లాడుతోంది. అనవసరంగా దీనిని రాజకీయం చేయొద్దు. సైన్యం పోరాటాన్ని అందరూ అభినందించాలి.. ప్రశంసించాలి. సైన్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు. ఆపరేషన్ సిందూర్‌ను కేవలం 22 నిమిషాల్లోనే పూర్తి చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాం. వందల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చాం. ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేశాం. పాక్ అణు హెచ్చరిక అబద్ధమని నిరూపించాం. మన సాంకేతిక ప్రతిభతో పాక్ గుండెలపై దాడి చేశాం. పాక్ ఎయిర్‌బేస్‌లకు తీవ్ర నష్టం కలిగించాం. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి అని ప్రధాని మోడీ లోక్‌సభ వేదికగా ప్రకటించారు.






