ఒడిశాలో ప్రధాని మోడీ అభివృద్ధి పర్యటన

by Malleboina Mahesh |

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఒడిశా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జహర్సుగూడాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఒడిశాలో ప్రధాని మోడీ అభివృద్ధి పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఈరోజు ఒడిశా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జహర్సుగూడాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దాదాపు ₹60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో రైల్వే కొత్త లైన్లు, ట్రాక్‌లు, స్టేషన్ అభివృద్ధి, అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం ఉన్నాయి. అదేవిధంగా BSNL స్వదేశీ 4G నెట్ వర్క్, 97,500కి పైగా మొబైల్ టవర్లు, 8 IITల విస్తరణ వంటి పథకాలను ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు ఒడిశా సహా తూర్పు భారతదేశానికి మరింత మెరుగైన కనెక్టివిటీ, విద్యా అవకాశాలు, సాంకేతిక పురోగతి కలిగించనున్నాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

వివిధ ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజా సభ (public assembly)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒడిశా భూభాగం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదని, ఇక్కడి ప్రజలు దేశ అభివృద్ధికి ప్రధాన బలం అని మోడీ అన్నారు. ఆయన తన విదేశీ ఆహ్వానాల కంటే ఒడిశా పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు మంచి మౌలిక వసతులు, శక్తివంతమైన టెక్నాలజీ, విద్యా సదుపాయాలు అందించడం ఈ పర్యటనలో ప్రారంభించిన ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Next Story