కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన మోడీ.. ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటనపై క్లారిటీ

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై విపక్షాల అనుమానాలకు లోక్‌సభలో ప్రధాని మోడీ(PM Modi) సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన మోడీ.. ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటనపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై విపక్షాల అనుమానాలకు లోక్‌సభలో ప్రధాని మోడీ(PM Modi) సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తాము ఏదైతే నిర్ణయించామో దానిని 100 శాతం పూర్తి చేశాం. ఉగ్రవాదుల మూలాలను నాశనం చేశాం. సరైన సమయం కోసం వేచి చూశాం.. పెహల్గాం దాడితో పాకిస్తాన్ ఆ అవకాశం మనకు ఇచ్చింది. ఫర్‌ఫెక్ట్‌గా అటాక్ చేశాం. ఏళ్ల తరబడి గుర్తుండిపోయే పాఠాన్ని పాకిస్తాన్‌కు మన సైన్యం నేర్పించింది. భారత్ దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని భారత్‌కు చెప్పలేదు. అలా చెప్పినా తాము వినే వ్యక్తులం కాదు. దేశానికి ఏం కావాలో ఆ సమయంలో అది చేసి తీరుతాం. దాడులు ఆపాలని పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. ఇది ప్రపంచ దేశానికి తెలుసు. ఎవరూ ఊహించని రీతిలో పాకిస్తాన్‌ను చీల్చిచెండాడాం. ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా నిలిచాయి. కేవలం మూడంటే.. మూడే దేశాలు పాక్‌కు మద్దతిచ్చాయి. కానీ.. కాంగ్రెస్ నేతలు.. వారి స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని, వారి వీరోచిత పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాకిస్తాన్‌కు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు. పాకిస్తాన్ మళ్లీ దుస్సాహాసం చేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. స్వావలంబనతో భారత్‌ నేడు ముందుకు పోతోంది. కానీ.. పాక్ కోసం కాంగ్రెస్ దిగజారి రాజకీయం చేస్తోంది’ అని ప్రధాని మోడీ లోక్‌సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story