- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి
భూటాన్ నుంచి ప్రధాని మోడీ తిరిగి భారత్ కు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పేలుళ్లపై కేంద్రం యాక్షన్ ప్లాన్ పై ఉత్కంఠ నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పేలుడు బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పరామర్శించారు. రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్( ఎల్ఎన్‍జేపీ) ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యం గురించి క్షతగాత్రులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఎర్రకోట (Red Fort) ఘటనపై భూటాన్ వేదికగా ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన 12 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో భూటాన్ లో ఉన్న ప్రధాని తాజాగా భారత్ కు తిరిగి రావడంతో భారత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.






