- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pm modi: పదవీ కాలం విజయవంతం కావాలి.. ట్రంపునకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) శుభాకాంక్షలు తెలిపారు. ‘యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నా ప్రియమైన స్నేహితుడు ట్రంపునకు అభినందనలు. భారత్-యూఎస్ రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి, ప్రపంచానికి మంచి భవిష్యత్‌ను రూపొందించడానికి నేను మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నా. పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా: పుతిన్
డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ‘రెండోసారి వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చిన ట్రంప్‌కు అభినందనలు. తన అధ్యక్ష పదవీ కాలంలో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా. ఉక్రెయిన్ వివాదంపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా ప్రయోజనాల ఆధారంగా శాశ్వత శాంతి నెలకొనాలి’ అని పేర్కొన్నారు. కాగా, తను అధ్యక్షుడిగా ఎన్నికైతే యుద్ధాలను ఆపుతానని ట్రంప్ పలు సార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.






