- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ప్రధాని మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ప్రధాని మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పాకిస్తాన్(Pakistan)కు కూడా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని చెప్పారు. పాకిస్తాన్ మళ్లీ తోక జాడిస్తే.. ఈసారి కలలో కూడా ఊహించని విధంగా దాడి చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.. అందుకే పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగబెట్టి మరీ మట్టుబెట్టారు. ఈసారి అంతకుమించిన ట్రీట్మెంట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పెహల్గాం దాడి తర్వాత భారత ప్రతీకార చర్య ఆపరేషన్ సిందూర్‌ను చూసి పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలు బిత్తరపోయాయని అన్నారు. ఇది ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే కాదని.. పాకిస్తాన్‌పై పెత్తనం చెలాయించాలనుకునే ప్రతీ దేశానికి హెచ్చరిక అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా మూడు దేశాలు ఉంటే.. భారత్‌కు మద్దతుగా వందల దేశాలు గొంతు విప్పాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్ష పార్టీలు తప్ప అందరూ దేశానికి, సైన్యానికి మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఇక్కడినుంచి వారు.. పాకిస్తాన్‌కు అధికార ప్రతినిధలుగా పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు. సైన్యం చేసిన పోరాటాన్ని తక్కువచేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.






