- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pm modi: ఎలన్ మస్క్‌తో ప్రధాని మోడీ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్ !
ఫ్రాన్స్ టూర్ అనంతరం రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం అమెరికా చేరుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ టూర్ అనంతరం రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) గురువారం అమెరికా చేరుకున్నారు. మోడీ యూఎస్ చేరుకోగానే అక్కడి భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన షెడ్యూల్‌లో భాగంగా మోడీ బిజీ బిజీగా గడిపారు. మొదట అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌ను కలిసిన మోడీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించారు. అనంతరం చారిత్రాత్మకమైన బ్లెయిర్ హౌస్‌లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon musk)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణ, ఎలక్ట్రిక్ వాహనాలు, భారత్‌లోకి టెస్లా ఎంట్రీ, స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు సహా పలు అంశాలపై డిస్కస్ చేశారు.
భారత్‌లో టెస్లాను విస్తరించడానికి మస్క్ గతంలో ఆసక్తి చూపించాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు త్వరలో ప్రారంభమవుతాయని పలువురు భావిస్తున్నారు. అనంతరం భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్‌తో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. కాగా, భారత కాలమానం ప్రకారం ప్రధాని మోడీ గురువారం అర్ధరాత్రి 2:30 గంటలకు అధ్యక్షుడు ట్రంపుతో భేటీ కానున్నారు.






