Pm modi: స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలి.. ప్రధాని మోడీ పిలుపు

by B.Srinivas |

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు,

Pm modi: స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలి.. ప్రధాని మోడీ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi)లో శనివారం జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, ఉపాధి రంగాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. అంతర్జాతీయంగా అస్థిరత వాతావరణం నెలకొందని తెలిపారు. అన్ని దేశాలు తమ వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నాయని, భారత్ సైతం తన ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, భారతీయులు తయారు చేసిన వాటినే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి పౌరుడూ దీనిని బాధ్యతగా తీసుకోవాలని నొక్కి చెప్పారు. దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని విభేదాలు పక్కన బెట్టి స్వదేశీ ఉత్పత్తుల కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌ (Operation sindhoor)లో భారత్ దేశీయ ఆయుధాల శక్తిని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. డ్రోన్లు, క్షిపణులు, వైమానిక రక్షణలు స్వావలంబన భారత్ బలాన్ని నిరూపించాయన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్ శబ్దం వింటే పాక్‌కు నిద్ర పట్టడం లేదని చెప్పారు.

Next Story